రాణించిన పంత్, సుందర్... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించిన టీమిండియా
- అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
- 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్
- ఆదుకున్న పంత్, సుందర్ జోడీ
- ప్రస్తుతం భారత్ స్కోరు 82 ఓవర్లలో 245/6
ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్లకు 245 పరుగులు కాగా.... పంత్ 89 పరుగులతోనూ, సుందర్ 38 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ ఆధిక్యం 40 పరుగులకు చేరుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, స్టోక్స్, లీచ్ తలో రెండు వికెట్లు తీశారు. ఓ దశలో టీమిండియా 200 పరుగులు దాటడం కష్టమనిపించినా, పంత్, సుందర్ జోడీ పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను నిలువరించింది.