Andhra Pradesh: ఏపీలో మరో 102 మందికి కరోనా

AP Covid Cases Bulletin
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 45,077 కరోనా పరీక్షలు నిర్వహించగా 102 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,317 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,275 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 871 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,171కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Positive Cases
Deaths
Active Cases

More Telugu News