జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: రఘురామకృష్ణరాజు
- చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీకి భయం ఎందుకు?
- మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు భయపడుతున్నారు
- నా నియోజకవర్గంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని... ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఒక ఎంపీగా ఉన్న తాను తన నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనపై వైసీపీ నేతలు కేసులు పెట్టారని, ఆ కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని కోరానని చెప్పారు. వాటిపై కోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తానని అన్నారు.