ఒకే వేదికపై 3,229 వివాహాలు... చత్తీస్ గఢ్ లో అరుదైన వేడుక

Mass wedding ceremony in Raipur set record
  • రాయ్ పూర్ ఇండోర్ స్టేడియంలో సామూహిక వివాహాలు
  • అన్ని వర్గాలు హాజరైన వైనం
  • సీఎం సమక్షంలో పెళ్లిళ్లు
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం భూపేశ్ భగేల్
  • సీఎం కన్యా వివాహ యోజన కింద వివాహాలు
  • గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ అరుదైన వేడుకకు వేదికగా నిలిచింది. సీఎం భూపేశ్ భగేల్ సాక్షిగా నేడు జరిగిన ఓ కార్యక్రమంలో 3,229 జంటలు ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాయి. విశేషం ఏంటంటే... ఈ జంటల్లో అన్ని మతాల వారు ఉన్నారు. హిందూ, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు ఈ సామూహిక వేడుక ద్వారా ఒక్కటయ్యారు.

చత్తీస్ గఢ్ లోని 22 జిల్లాలకు చెందిన వధూవరులు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయ్ పూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేలాది జంటల వివాహ కార్యక్రమం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ భారీ పెళ్లి వేడుకను రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సీఎం కన్యా వివాహ యోజన పథకం కింద నిర్వహించింది.
Go Back to Shorts
Mass Weddings
Raipur
Chattisgarh
Bhupesh Baghel
Golden Book Of Records

More Telugu News