ఈ మాత్రానికే చొక్కాలు చించుకుంటే ఎలా?: సజ్జల
- ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- టీడీపీ ఆఫీసు వద్ద సంబరాలు
- సెటైర్ వేసిన సజ్జల
- చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ స్థానంలా చూపారని విమర్శలు
ఈ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో చూపించారని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది అనే అపవాదు వాస్తవం కాదన్నది ఈ ఫలితాలతో తేలిపోయిందని సజ్జల స్పష్టం చేశారు. ఓటమిని అంగీకరించలేని చంద్రబాబే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఉద్ఘాటించారు.