వధువు మరో యువకుడితో పారిపోయిందని ఆమె చెల్లెల్ని చేసుకున్న వరుడు... పెళ్లి చెల్లదన్న అధికారులు!
- ఒడిశాలో ఘటన
- మాల్పాడ గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 16న వివాహం
- అదే సమయానికి ప్రియుడితో వెళ్లిపోయిన యువతి
- ఆమె చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు
- బాలిక మైనర్ అంటూ అధికారుల రంగప్రవేశం
ప్రస్తుతం ఆ బాలికకు 15 ఏళ్లు కాగా, టెన్త్ క్లాస్ చదువుతోంది. బాల్య వివాహం జరిగిందన్న సమాచారంతో పెళ్లికొడుకు నివాసానికి చేరుకున్న అధికారులు ఆ బాలికను ఆమె సోదరుడికి అప్పగించారు. మైనర్ బాలికకు వివాహం నిబంధనలకు విరుద్ధమని, ఆమె మేజర్ అయ్యేవరకు పెళ్లి మాటే ఎత్తవద్దని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చక్కగా చదువుకోవాలంటూ ఆ అమ్మాయికి సూచించారు. పాపం, ఆ వరుడు తన పెళ్లి ఇలా కావడం పట్ల మరోసారి తీవ్ర నిరాశకు గురయ్యాడు.