రామ్ తాజా చిత్రంలో నాయికగా కృతిశెట్టి?
- 'ఉప్పెన'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి
- సినిమా హిట్టవ్వడంతో పలు ఆఫర్లు
- లింగుస్వామి, రామ్ సినిమాలో ఛాన్స్
తాజాగా కృతిశెట్టికి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడ వెలువడింది. ఊరమాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని నిర్మాత శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టి ఎంపికైనట్టు తాజా సమాచారం.