Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 68 పాజిటివ్ కేసుల నమోదు

Sixty Eight corona positive cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,620 కరోనా పరీక్షలు నిర్వహించగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 11 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున వెల్లడయ్యాయి.

అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకోగా, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,784 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 814 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,162కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Active Cases

More Telugu News