Australia: చెన్నై టెస్టులో క్రీజులో పాతుకుపోయి భారీ షాట్లు కొడుతోన్న జో రూట్‌, బెన్ స్టోక్స్!

1st Test  Chennai aus  score 386
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య చెన్నైలో జ‌రుగుతోన్న తొలి టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ క్రీజులో పాతుకుపోయి త‌న జోరును కొన‌సాగిస్తున్నాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఈ రోజు ఆట ప్రారంభించిన జో రూట్ 17 ఫోర్లు, ఒక సిక్స‌రు సాయంతో 168, బెన్ స్టోక్స్ 10 ఫోర్లు 3 సిక్స‌ర్ల సాయంతో 79 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. నిన్న రోరీ బర్న్స్ 33,  డామ్ సిబ్లీ 87, లారెన్స్ 0 ప‌రుగులు చేసి ఔటైన విష‌యం తెలిసిందే.

టీమిండియా బౌల‌ర్ల‌లో బుమ్రాకు రెండు వికెట్లు, అశ్విన్ కు ఓ వికెట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 125 ఓవ‌ర్ల‌కు 386/3  గా ఉంది. జో రూట్, బెన్ స్టోక్స్ జోడీని విడ‌దీయ‌డానికి భార‌త బౌల‌ర్లు ఆపసోపాలు ప‌డుతున్నారు.
Go Back to Shorts
Australia
India
Team India
Cricket

More Telugu News