కుప్పంలోనూ కూసాలు కదిలిపోతున్నాయి: విజయసాయిరెడ్డి

  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు
  • గ్రామాల్లో ఐక్యత లేకుండా చేయాలన్నది చంద్రబాబు కుట్ర అని విమర్శ  
  • చిత్తూరు జిల్లాలోనే అత్యధిక ఏకగ్రీవాలు అయ్యాయని వివరణ
  • బాబు దయనీయ స్థితిలో ఉన్నాడని ఎద్దేవా
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. పంచాయతీ ఏకగ్రీవాలను అడ్డుకుని కక్షలు, కార్పణ్యాలు రగిల్చి గ్రామాల్లో ఐకమత్యం లేకుండా చేయాలన్నది చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. అయితే చెంప చెళ్లుమనిపించేలా ఆయన సొంత జిల్లా చిత్తూరులోనే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఎద్దేవా చేశారు. కుప్పంలోనూ కూసాలు కదిలిపోతున్నాయని విజయసాయి వ్యాఖ్యానించారు.

అంతకుముందు మరో ట్వీట్ లోనూ విజయసాయి టీడీపీ అధినేతపై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ పై నోరు విప్పడానికి చంద్రబాబు గజగజ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి కాదని, బీజేపీతో పొత్తూ లేదని, ఉండదని కమలం పార్టీలు కరాఖండీగా చెప్పారని వివరించారు. అయినా బాబుకు నోరు పెగలడంలేదని విమర్శించారు. తన రాజకీయ విధానాలేంటో కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాడని వ్యాఖ్యానించారు.

Vijayasai Reddy
Chandrababu
Gram Panchayat Elections
Unanimous
Andhra Pradesh

More Telugu News