సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'రిపబ్లిక్' షూటింగ్ పూర్తిచేసిన రమ్యకృష్ణ
- కేరళ అడవులకు వెళ్లనున్న 'పుష్ప'
- 'ముంబైకర్' షూటింగులో విజయ్ సేతుపతి
* అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం మారేడుమిల్లి షెడ్యూలు ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలు, ఓ యాక్షన్ ఎపిసోడ్, ఒక పాటను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూలును కేరళ అడవుల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
* ప్రముఖ కెమేరామెన్ సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న హిందీ చిత్రం 'ముంబైకర్'. జనవరి 10న మొదలైన ఈ చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూలులో పూర్తి చేస్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లో షూటింగ్ చేస్తున్నారట.