ఉప్పెన ట్రైలర్ రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్
- వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా ఉప్పెన
- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
- ఫిబ్రవరి 12న రిలీజ్
- ఇప్పటికే హిట్టయిన పాటలు
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఉప్పెన చిత్ర విశేషాలను వారిని అడిగి తెలుసుకున్నారు. యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ ఉప్పెన ట్రైలర్ లాంచ్ చేసినందుకు యంగ్ టైగర్ తారక్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.
ఉప్పెన చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం అనే గీతం విపరీతమైన ప్రజాదరణ పొందింది.