Amazon: సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నా: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

Jeff Bezos to Step Down as Amazon CEO
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని, ఇప్పుడీ పదవి నుంచి మారడానికి ఇదే సరైన సమయమని ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్ పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి పదవి నుంచి తప్పుకుని  వెబ్ సర్వీసెస్ హెడ్ ఆండీ జెస్సీకి బాధ్యతలు అప్పగిస్తానని తెలిపారు. సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బెజోస్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్ షిప్, అమెజాన్ డే1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్టు బెజెస్ తెలిపారు.

27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు విక్రయించే ఉద్దేశంతో బెజోస్ అమెజాన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం బైజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. కాగా, బెజోస్ తర్వాత అమెజాన్ పగ్గాలు చేపట్టనున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
Go Back to Shorts
Amazon
jeff bezos
Andy Jassy
E-Commerce

More Telugu News