Nayanatara: చిరంజీవి సినిమాలో మరోసారి నయనతార?

Nayanatara opposite Chiranjeevi again
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత మలయాళ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ లో నటించనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం  షూటింగును  హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ చిత్రం మలయాళ మాతృకకు తెలుగులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా తెలుగులో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో మలయాళంలో లేని ఆ క్యారెక్టర్ ను ఇక్కడ జత చేస్తున్నారట. పైగా, ఆ పాత్రను కూడా కాస్త పవర్ ఫుల్ గానే రూపుదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రకు ప్రముఖ కథానాయిక నయనతారను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. చిరంజీవి స్టేచర్ కి నయనతార అయితే, బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డైలాగుల వెర్షన్ రచన జరుగుతోంది. ప్రముఖ రచయితలు ఆకుల శివ, బుర్రా సాయిమాధవ్ లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
Go Back to Shorts
Nayanatara
Chiranjeevi
Mohan Raja

More Telugu News