అల్లు అర్జున్ 'పుష్ప' విడుద‌ల తేదీ ఖ‌రారు.. అల‌రిస్తోన్న కొత్త పోస్ట‌ర్!

PUSHPA loading in theatres from 13th August 2021
  • సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో 'పుష్ప'
  • ఆగస్టు 13న థియేట‌ర్ల‌లో విడుద‌ల
  • గొడ్డ‌లి ప‌ట్టుకుని ఉన్న బ‌న్నీ పోస్ట‌ర్
సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న  'పుష్ప' సినిమా విడుద‌ల తేదీని ఆ సినిమా బృందం ప్ర‌క‌టించింది. ఆగస్టు 13న 'పుష్ప' చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మ‌రో పోస్ట‌ర్ అల‌రిస్తోంది.

గొడ్డ‌లి ప‌ట్టుకుని చుట్టూ త‌న బ‌లగంతో ఉన్న బ‌న్నీ పోస్ట‌ర్ అద్భుతంగా ఉండ‌డంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా క‌న‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో చిత్తూరు యాసలో హీరో డైలాగ్స్ ఉంటాయి.  

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

కాగా, ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో బ‌న్నీ ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. థియేటర్లలో ప్రేక్ష‌కులందరినీ కలవడం కోసం తాను ఎంతగానో  ఎదురుచూస్తున్నానని చెప్పాడు. తాను, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌లు మరోసారి చరిత్రను పునరావృతం చేస్తామని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.
Go Back to Shorts
Pushpa
Allu Arjun
Tollywood
Rashmika Mandanna

More Telugu News