శశికళకు భద్రత కల్పించండి: కేంద్ర హోంశాఖకు ఆమె లాయర్ లేఖ
- కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన రాజరాజన్
- నేటితో ముగియనున్న శశికళ నాలుగేళ్ల శిక్ష
- విడుదల అనంతరం చెన్నైలోని మేనకోడలి ఇంటికి
శశికళ విడుదల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది రాజరాజన్ కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తూ..శశికళకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరారు. జైలు నుంచి విడుదలయ్యాక శశికళ చెన్నైలోని తన సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉంటారని, ఆమెకు భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.