తాజా మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రిలీజ్ డేట్
- సుబ్బు దర్శకత్వంలో 'ఉప్పెన'
- కరోనా వల్ల విడుదలలో జాప్యం
- చివరికి థియేటర్లలోనే విడుదల
- ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు
ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఈ రోజు ప్రకటించారు. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటించగా.. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ముఖ్యంగా 'నీ కన్ను నీలి సముద్రం..' అంటూ సాగే పాట అయితే సూపర్ హిట్టయింది.