కర్బన సంగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి 100 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన ఎలాన్ మస్క్
- ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు
- పర్యావరణ హితం కోసం మస్క్ ప్రకటన
- వచ్చే వారం మరిన్ని వివరాలు వెల్లడిస్తానంటూ ట్వీట్
- తన ప్రకటనతో పోటీతత్వం పెరుగుతుందని భావిస్తున్న మస్క్
కర్బన సంగ్రహణం కోసం రూపొందించే అత్యుత్తమ విధానానికి తన బహుమతి లభిస్తుందని, దీనికి సంబంధించిన ఇతర వివరాలను వచ్చేవారం వెల్లడిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. తన బహుమతి ప్రకటన ద్వారా పోటీతత్వం మరింత పెరిగి త్వరితగతిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఈ టెస్లా అధినేత భావిస్తున్నారు.