Crime News: ప్రొద్దుటూరులో క‌ల‌క‌లం.. ప్రేమించ‌ట్లేద‌ని అమ్మాయిని క‌త్తితో పొడిచిన యువ‌కుడు

man attacks on girl
షార్ట్స్‌లో చూడండి
క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో క‌ల‌కలం చెల‌రేగింది. ఓ యువ‌తిపై ప్రేమోన్మాది దాడికి పాల్ప‌డ్డాడు. త‌న‌ను ప్రేమించాల‌ని అమ్మాయిని వేధిస్తోన్న సునీల్ అనే యువ‌కుడు ఈ రోజు ఆ యువ‌తిపై క‌త్తితో దాడి చేశాడు. ఆ యువ‌తి తీవ్ర‌గాయాల‌పాలు కావ‌డంతో గుర్తించిన‌ ఆమె కుటుంబ స‌భ్యులు స్థానిక‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

సునీల్ అనే యువ‌కుడు మూడు నెల‌లుగా త‌మ అమ్మాయి వెంట ప‌డుతూ వేధిస్తున్నాడ‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. ప్రేమ‌ను అంగీక‌రించ‌క‌పోవ‌డంతోనే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Crime News
Kadapa District

More Telugu News