కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!
- బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని కేంద్రం నిర్ణయం
- కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
- జనవరి 29న ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు
ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు... రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.