గీత దాటిన చైనా సైనికుడ్ని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
- భారత భూభాగంలో ప్రవేశించిన చైనా సైనికుడు
- నిన్న వేకువ జామున అతడిని పట్టుకున్న జవాన్లు
- విచారణ జరుపుతున్నామన్న సైన్యం
- గత అక్టోబరులోనూ ఇదే తరహా ఘటన
జనవరి 8 వేకువజామున అతడిని పట్టుకున్నట్టు భారత సైన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. సరిహద్దు నిబంధనల ప్రకారం అతడిని విచారిస్తున్నామని తెలిపారు. అతడు సరిహద్దులు దాటడానికి గల కారణాలు ఏమిటి? ఇతర పరిస్థితులేమైనా అందుకు దారితీశాయా? అనేది విచారణలో తేలుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.
గతేడాది అక్టోబరులోనూ వాంగ్ యా లాంగ్ అనే చైనా సైనికుడు ఇలాగే భారత్ లో ప్రవేశించాడు. అయితే అతడు దారితప్పి మన భూభాగంలో అడుగుపెట్టాడని తెలుసుకున్న భారత సైన్యం భద్రంగా చైనాకు అప్పగించింది.