2020 ఒక పీడకల.. 2021లో జోరు పెంచుతాం: చంద్రబాబు

  • జగన్ చేతిలో రాష్ట్రం భ్రష్టు పట్టింది 
  • కార్యాలయాలకు రంగులు వేయడం తప్ప చేసిందేమీ లేదు
  • సీఎం, మంత్రులు గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు
2020వ సంవత్సరం తమకు ఒక పీడకల అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2021లో జోరు పెంచుతామని చెప్పారు. జగన్ చేతిలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని.. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి పాలన ఉందని విమర్శించారు. అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి అంటే దేవతల రాజధాని అని అన్నారు.

జగన్ సీఎం అయిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఒక ఫేక్ సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాంబులకే తాను భయపడలేదని... మీరెంత అని ఎద్దేవా చేశారు.


More Telugu News