మరో క్రేజీ కలయిక... పవన్ తో హరీశ్ శంకర్ సుదీర్ఘ సమావేశం

Harish Shankar met Pawan Kalyan
  • రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్
  • ఇటీవల వరుసగా సినిమాలు
  • వకీల్ సాబ్ తో రీఎంట్రీ
  • హరీశ్ దర్శకత్వంలో పవన్ 28వ చిత్రం
జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలతో బిజీ అయిన పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఆయన అంగీకరించిన సినిమాల్లో దర్శకుడు హరీశ్ శంకర్ తో చేయాల్సిన ప్రాజెక్టు కూడా ఉంది. ఇది పవన్ కు 28వ సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

తాజాగా, నూతన సంవత్సరం మొదటి రోజు సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత రవి... హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను  కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. పవన్ ను కలవడంపై హరీశ్ శంకర్ స్పందిస్తూ, పవన్ కల్యాణ్ తో సుదీర్ఘ సమయం పాటు సమావేశం జరిగిందని, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని తెలిపారు. ఇది తమకు ఉద్విగ్న సమయంగా భావించడంలేదని, ఓ భారీ ప్రారంభానికి ఇది నాంది అని పేర్కొన్నారు.

పవన్, హరీశ్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హరీశ్ కూడా గద్దలకొండ గణేశ్ చిత్రంతో మాంచి ఫామ్ లో ఉన్నాడు. పవన్, హరీశ్ క్రేజీ కాంబినేషన్ ఈసారి కూడా బాక్సాఫీసును షేక్ చేస్తుందని భావిస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Harish Sankar
PSPK28
Tollywood

More Telugu News