కొనసాగుతున్న విగ్రహాల విధ్వంసం... రాజమండ్రి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అపచారం!

Another Lord Idol Demolished in AP
  • ఇటీవల రామతీర్థం ఆలయంలో శ్రీరాముని తల నరికివేత
  • తాజాగా రాజమండ్రి విఘ్నేశ్వరాలయంలో మరో ఘటన
  • నిందితులను గుర్తించే పనిలో పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో ఉన్న రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను నరికివేసిన ఘటనను మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విఘ్నేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఇక్కడి ఉపాలయంలో ఉన్న విగ్రహం రెండు చేతులను దుండగులు తొలగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వందలాది మంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
Go Back to Shorts
RAjamandri
Temple
Lord Subrahmanyeshwara

More Telugu News