మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో తెలుగు మాటలు... నెట్టింట సందడి చేస్తున్న వీడియో!
- టీమిండియాలో తెలుగుతేజం
- మిడిలార్డర్ లో ఆడుతున్న హనుమ విహారి
- ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్
- త్వరగా అవుట్ చేయాలని కోరిన ప్రేక్షకుడు
- అలాగైతే మ్యాచ్ అయిపోతుందన్న విహారి
- తెలుగులో సాగిన సంభాషణ
అయితే ప్రేక్షకుల్లో ఓ తెలుగు వ్యక్తి ఉండడంతో, విహారిని ఉద్దేశించి అతడు తెలుగులో మాట్లాడాడు. త్వరగా అవుట్ చేయండి అంటూ విహారిని కోరాడు. అందుకు విహారి బదులిస్తూ, త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది కదా అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ మరికాసేపు సాగితే ప్రేక్షకులకు వినోదం లభిస్తుందన్న కోణంలో విహారి ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ తెలుగు టు తెలుగు సంభాషణ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.