Raghu Rama Krishna Raju: రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకెళ్లిన ఘటన చాలా దారుణం: రఘురామకృష్ణరాజు

విజయనగరం జిల్లా రామతీర్థంలో కొందరు దుండగులు రాముడి విగ్రహం తల నరికి తీసుకెళ్లారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దారుణమని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకెళితే వెంటనే చర్యలు తీసుకుంటారని, కానీ హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

'మీకు హిందువులంటే అంత చులకనా?' అంటూ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ ను ప్రశ్నించారు. హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిని పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కారు వచ్చాక వరుసగా జరుగుతున్న సంఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.
Raghu Rama Krishna Raju
Puri Jagannadh
Ram Idol
Vandalise
Vijayanagaram District

More Telugu News