ఆర్మీజవాను అంత్యక్రియలకు హాజరైన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మహబూబ్ నగర్ జిల్లా వాసి పరశురాం లడఖ్ లో మృతి
- ఆర్మీలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న పరశురాం
- కొండచరియలు విరిగిపడి దుర్మరణం
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నేడు, పరశురాం అంత్యక్రియలు అతడి స్వస్థలంలో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాను పరశురాం కుమారుడ్ని ఎత్తుకుని వారికి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పరశురాం కుమార్తె తండ్రి భౌతికకాయం ఎదుట సెల్యూట్ చేయడం ఆ చిన్నారి స్ఫూర్తికి అద్దం పట్టింది.