రేపు యథాతథంగా ఇళ్ల పట్టాల పంపిణీ... నిలిపివేసేలా స్టే ఇవ్వలేమన్న హైకోర్టు
- పంపిణీపై కోర్టును ఆశ్రయించిన ప్రసాద్ బాబు
- ఒక వర్గం వారికి వేరే నియోజకవర్గంలో స్థలాలు కేటాయించారని వెల్లడి
- సమస్యలు వస్తాయని కోర్టుకు విన్నపం
- పిటిషనర్ అభ్యంతరాలు తోసిపుచ్చిన న్యాయస్థానం
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఓ వర్గం వారికి వేరే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రసాద్ బాబు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, పంపిణీపై స్టే ఇవ్వాలని కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.