‘బ్రిటన్ కరోనా’తో ఏడు కొత్త లక్షణాలు.. వివరాలు ఇవిగో!
- ఆయా లక్షణాలతో జాబితా విడుదల చేసిన ఎన్ హెచ్ఎస్
- తలనొప్పి, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం..
- అలసట, విరేచనాలు, గందరగోళం వంటి లక్షణాలు
మరి, అప్పటి వరకు మనకు ఆ వైరస్ సోకిందన్న అనుమానమొస్తే గుర్తించడం ఎలా? అందుకే.. రూపు మార్చుకున్న ఈ కొత్త వైరస్ తో కలుగుతున్న ఏడు కొత్త లక్షణాలను బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) వెల్లడించింది. ఇప్పటిదాకా జ్వరం, దగ్గు, వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలుసుకోలేకపోవడం వంటివి మాత్రమే కొవిడ్ లక్షణాలని అందరికీ తెలుసు. ఇప్పుడు వాటికి జత కలిసిన కొత్త స్ట్రెయిన్ లక్షణాలివే...
* అలసట
* ఆకలి లేకపోవడం
* విపరీతమైన తలనొప్పి
* విరేచనాలు
* గందరగోళంగా అనిపించడం
* కండరాల నొప్పులు
ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే టెస్టు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.