పబ్‌లో నన్ను అరెస్టు చేయలేదు.. వార్తలన్నీ అవాస్తవం: హీరో హృతిక్ మాజీ భార్య
- కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ముంబైలో డ్రాగన్ ఫ్లై పబ్‌ను తెరిచిన నిర్వాహకులు
- సుజానేను అరెస్టు చేశారని వార్తలు
- పబ్‌లోకి వచ్చి అధికారులు చెక్ చేశారని వ్యాఖ్య
- తమను అక్కడే మూడు గంటలు ఉంచి పంపారని వివరణ
దీనిపై ఆమె స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది. తాను సోమవారం రాత్రి ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ డిన్నర్‌కు హాజరయ్యానని తెలిపింది. ముంబైలోని ఓ పబ్‌కు తాము వెళ్లామని చెప్పింది. తెల్లవారుజామున 2 గంటలు దాటాక కొందరు అధికారులు పబ్‌లోకి వచ్చి, అక్కడ కరోనా నియమ నిబంధనలను పాటిస్తున్నారా? అన్న విషయాన్ని పరిశీలించారని చెప్పింది.
ఆ సమయంలో అందులో ఉన్న వారందరినీ మూడు గంటలపాటు అక్కడే వేచి ఉండాలని చెప్పారని తెలిపింది. అనంతరం ఉదయం 6 గంటలకు తమను పంపించారని చెప్పింది. అంతేగానీ, తనను అరెస్ట్ చేయలేదనీ, తన అరెస్ట్ గురించి వస్తోన్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది.