చాలా కాలంగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కల సాకారమయ్యే సమయం వచ్చింది: రాజకీయ ప్రవేశంపై హీరో విజయ్
తమిళనాడులో ఇప్పటికే సినీనటులు విజయ్ కాంత్, కమల హాసన్ తాజాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. సినీనటుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. అప్పుడప్పుడు అభిమానులు విజయ్ పోస్టర్లను ఏర్పాటు చేస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు.
ఇప్పుడు మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వార్తలు వస్తున్నాయి. దీంతో తన అభిమానులు నిరాశ చెందకుండా విజయ్ ఓ కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశంలో జరుగుతోన్న ఆలస్యంతో అసంతృప్తితో ఉన్న అభిమానులు ఎవ్వరూ ఇతర పార్టీల్లోకి వెళ్లొద్దని ఆయన సూచించడం గమనార్హం.
తన అభిమాన సంఘం ‘మక్కల్ ఇయక్కం’ నుంచి అభిమానులు వైదొలగవద్దని ఆయన కోరారు. చాలాకాలంగా సహనంతో ఎదురు చూసిన అభిమానుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందంటూ ప్రకటన చేశారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని చెప్పారు. కాగా, నిన్న తన అభిమాన సంఘాల నేతలతో విజయ్ సమావేశమై ఈ విషయంపై చర్చించారు.