మరిన్ని నవ్వులు పూయించేందుకు 'ఎఫ్-3' షూటింగ్ మొదలు!
- గత సంవత్సరం విడుదలైన ఎఫ్-2
- దానికి కొనసాగింపుగా మరో చిత్రం
- 23 నుంచి రెగ్యులర్ షూటింగ్
సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నామని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఇక ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.