పెళ్లి విందులో రాకుమార్తెలా మెరిసిన మెగా డాటర్.. మనీశ్ మల్హోత్రా బ్రైడల్ లెహంగాలో నిహారిక!
- నిన్న హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు
- ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర రూపొందించిన బ్రైడల్ లెహంగాలో నిహారిక
- లైట్ గ్రీన్, గోల్డ్ కలర్లో ఉన్న లెహంగా
- గతంలో ఓ ప్రకటనలో ధరించిన జాన్వీ
ఈ విందులో నిహారిక వేసుకున్న దుస్తులు అందరినీ ఆకర్షించాయి. వాటిని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర రూపొందించారు. లైట్ గ్రీన్, గోల్డ్ కలర్లో ఉన్న ఈ బ్రైడల్ లెహంగాలో నిహారిక కనపడింది. ఇటువంటి లెహంగానే ఇటీవల శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి జాన్వికపూర్ ధరించింది.
మనీశ్ మల్హోత్ర బ్రైడల్ కలెక్షన్ ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ప్రకటన రూపొందించారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయ్యాయి. నిహారిక కూడా అదే స్టైల్లోని లెహంగాలో కనిపడడంతో నెటిజన్లు జాన్వీ, నిహారికలను పోల్చుతూ ఫొటోలు పెడుతున్నారు.