2 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం... టికెట్లు విడుదల చేసిన టీటీడీ!
- డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి
- రోజుకు 20 వేల మందికి దర్శనం
- 10 రోజులు తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుంది.