'జగనన్న జీవ క్రాంతి' ప్రారంభం... గొర్రెపిల్ల, కంబళితో సీఎం
- మహిళల స్వావలంబనే లక్ష్యంగా 'జగనన్న జీవ క్రాంతి'
- క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం
- రూ.1,869 కోట్లతో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ
- ఇప్పటికే గేదెలు, ఆవుల పంపిణీ
- కరవు వచ్చినా జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయన్న సీఎం
కాగా, 'జగనన్న జీవ క్రాంతి' పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి రూ.1,869 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, వ్యవసాయం మాత్రమే కాకుండా మేకలు, గొర్రెలు, పశువులు, చేపలు, కోళ్ల పెంపకం కూడా చేపడితే రైతుల కుటుంబాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.
కరవు కాటకాలు వచ్చి వ్యవసాయంలో నష్టం వచ్చినా, ఈ జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయని వివరించారు. ఇప్పటికే ఆవులు, గేదెల పంపిణీ ప్రారంభించామని, అందుకోసం రూ.3,500 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను పట్టించుకోలేదని ఆరోపించారు.