Khammam District: ఇంట్లో రేపు పెళ్లి... అంతలోనే ఇద్దరు అమ్మాయిలతో కలిసి తల్లి ఆత్మహత్య.. ఖమ్మంలో కలకలం!

Mother Sucide with Two Daughters in Khammam
  • పెళ్లికి సర్దుబాటు కాని డబ్బులు
  • ఏ పనీ చేయని భర్త 
  • రసాయన ద్రావణం తాగి ఆత్మహత్య 
రేపు పెళ్లి జరగాల్సిన ఇంట, తల్లి, వధువు సహా మరో కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ (48)కు కుమార్తెలు రాధిక (30), రమ్య (28) ఉన్నారు. గోవిందమ్మ కుటుంబం కడు పేదరికంలో ఉంది. ఆమె భర్త ఏ పనీ చేయకపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి.

పైగా ఇంట్లో పెళ్లీడు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిలో రాధికకు చాలా కాలం తరువాత ఓ సంబంధం కుదరగా, 11న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి సమయం గంటల్లోకి వచ్చినా, డబ్బులు సర్దుబాటు కాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని గోవిందమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు ముగ్గురూ నిన్న అర్ధరాత్రి బంగారాన్ని శుభ్రంచేసే రసాయన ద్రావణాన్ని తాగి, ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Khammam District
Sucide
Marriage

More Telugu News