జనవరి 15 నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్టు విమాన సర్వీసులు
- 238 సీట్ల సామర్థ్యం కలిగిన విమానంతో సేవలు
- మరిన్ని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్న ప్రదీప్ ఫణికర్
- తొలుత హైదరాబాద్-షికాగో మధ్య సేవలు
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు నడిపేందుకు శంషాబాద్ విమానాశ్రయం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నిజానికి హైదరాబాద్, అమెరికా మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. అయితే, అందుకు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేవు. దీంతో నగరం నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు కనెక్టింగ్ సర్వీసులతో అమెరికా చేరుకుంటున్నారు.