అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక-చైతన్యల వివాహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక-చైతన్యల వివాహం

Niharika tie the knot with Chaitanya
  • నిహారిక మెడలో మూడు ముళ్లు వేసిన చైతన్య
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుక 
  • సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్ 
సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధూవరులిద్దరూ ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ లో వీరి వివాహ వేడుక జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Niharika Konidela
Marriage
Tollywood

More Telugu News