విషపదార్థం కారణంగా కలిగిన అస్వస్థత అని భావిస్తున్నాం: జీవీఎల్
- ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య
- ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న వ్యాధి కారణం
- మాస్ హిస్టీరియా కారణం కాదన్న జీవీఎల్
- ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడినట్టు వెల్లడి
- శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపారని వివరణ
అంతుచిక్కని వ్యాధితో ప్రజలు ఆసుపత్రిపాలవడం పట్ల ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో మాట్లాడానని జీవీఎల్ వెల్లడించారు. ఎయిమ్స్ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు ఏలూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి రక్తం, మూత్రం, సీఎస్ఎఫ్ నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్ లోని క్లినికల్ ఎకోటాక్సికాలజీ విభాగానికి పంపారని తెలిపారు.