Vijay Sai Reddy: ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది: టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్

vijaya sai slams chandrababu
షార్ట్స్‌లో చూడండి
 నిన్న ప్రకటించిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కని విషయం తెలిసిందే. 106 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి ఫలితాలు ఇలాగే వస్తాయని జోస్యం చెప్పారు.

‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో 106 స్థానాల్లో పోటీ చేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రి కొడుకులు, మద్దతుదారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతోందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.   
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Andhra Pradesh
GHMC Elections

More Telugu News