బురేవి తుపాను ప్రభావం.. తిరుమలలో భారీ వర్షం
- తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలలో భారీ వర్షాలు
- శ్రీవారి ఆలయం, మాడవీధులు, కాటేజీలు జలమయం
- ఘాట్ రోడ్డులో అధికారుల నిఘా
మరోవైపు, ‘బురేవి’ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రానికి తమిళనాడులోని పంబన్ పరిసరాల్లో కేంద్రీకృతమైన తుపాను.. పశ్చిమ వాయవ్యంగా పయనించి నేటి ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.