అమెరికా ఎడారిలో మాయమై... రొమేనియాలో ప్రత్యక్షమైన లోహపు దిమ్మె... ఏమిటీ మిస్టరీ?
- ఇటీవల ఉటా ఎడారిలో కనిపించిన దిమ్మె
- కొన్నిరోజుల తర్వాత మాయం
- రొమేనియా డేసియన్ కోట సమీపంలో కనిపించిన దిమ్మె
అయితే, ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెకు, దీనికి స్వల్పంగా తేడాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉటాలోని దిమ్మె పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ లోహంతో తయారైనది కాగా, రొమేనియాలోని దిమ్మెపై చిత్రమైన రాతలు ఉన్నట్టు గుర్తించారు. అసలింతకీ ఈ లోహపు దిమ్మెల వెనుక ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇలాంటివి గ్రహాంతర వాసుల చర్యలే అయ్యుంటాయని కొందరు భావిస్తున్నారు.