తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,69,223
  • కోలుకున్న 2,57,278 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,455 
తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 948 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,69,223కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,57,278 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,455కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 131 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 58  కేసులు నిర్ధారణ అయ్యాయి.
  

Corona Virus
COVID19
Telangana

More Telugu News