ఫొటోతో విరుచుకుపడిన రాహుల్ గాంధీ.. వీడియోతో రిప్లై ఇచ్చిన బీజేపీ
- పంజాబ్ రైతుపై లాఠీ ఎత్తిన పోలీసు ఫొటోను షేర్ చేసిన రాహుల్
- జవాను కాస్తా కిసాన్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడని ఆవేదన
- ఆ రైతును పోలీసులు తాకలేదంటూ బీజేపీ వీడియో
రాహుల్ సోదరి, కాంగ్రెజ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి ఫొటోలే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. బీజేపీ బిలియనీర్ ఫ్రెండ్స్‌కు ఢిల్లీలో రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంటే, రైతులు వస్తుంటే రోడ్లపై గుంతలు తవ్వేస్తున్నారని విమర్శించారు.
కాగా, రాహుల్ షేర్ చేసిన ఫొటోపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ఓ వీడియోను పోస్టు చేశారు. రాహుల్ ఫొటోను ‘ప్రచారం’గా పేర్కొన్న ఆయన ఆ రైతును పోలీసు కనీసం తాకను కూడా లేదని పేర్కొన్నారు. అంతేకాదు, రాహుల్‌ను దేశంలోనే అపఖ్యాతి పాలైన నాయకుడిగా అమిత్ అభివర్ణించారు.