చెప్పుడు మాటలు విని కేసీఆర్ నన్ను పక్కన పెట్టారు: స్వామిగౌడ్
- కేసీఆర్ ను తండ్రిలా భావించాను
- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా
- బండి సంజయ్ దమ్మున్న మగాడు
ఆత్మాభిమానం లేని చోట తాను ఉండలేనని స్వామిగౌడ్ చెప్పారు. కేసీఆర్ ను తాను తండ్రిలా భావించానని... అయితే, చెప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని అన్నారు. రెండు నిమిషాల టైమ్ కూడా తనకు ఇవ్వలేదని చెప్పారు. బండి సంజయ్ దమ్మున్న మగాడు అని... పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చితే దారుస్సలాంను పగలగొడతామన్న నాయకుడని... ఇలాంటి బలమైన నాయకత్వమే ఇప్పుడు కావాలని అన్నారు.