బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన రకుల్!

Rakul Preeth Sing eyes on Bollywood
  • దక్షిణాదిన తగ్గిన రకుల్ జోరు
  • తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలే
  • హిందీలో రకుల్ కి మూడు సినిమాలు    
ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలతో తెలుగు సినిమాకి గ్లామర్ అద్దారు. ముఖ్యంగా ఉత్తరాది భామలు మరీనూ. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం సంశయాలు లేకుండా.. ఏమాత్రం అభ్యంతరాలు చెప్పకుండా వెండితెరను గ్లామర్ మయం చేస్తుంటారు. అందుకే, మన దర్శక నిర్మాతలు ఉత్తరాది భామలకు ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ విషయంలో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోల సరసన పలు సినిమాలలో నటించి గ్లామరస్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.

అయితే, ఇటీవల కొత్త భామల రంగ ప్రవేశంతో ఈ ముద్దుగుమ్మ ప్రాభవం ఇక్కడ కాస్త తగ్గింది. అందుకే ఇప్పుడు దక్షిణాది సినిమాలలో నటిస్తూనే బాలీవుడ్ మీద దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో హిందీలో ప్రస్తుతం తాను మూడు సినిమాలు చేస్తున్నట్టు రకుల్ తెలిపింది. జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న 'ఎటాక్', అమితాబ్- అజయ్ దేవగణ్ కలసి నటిస్తున్న 'మేడే' సినిమాలతో పాటు.. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నానని చెప్పింది.

ఇక తెలుగులో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'చెక్' సినిమాలోనూ నటిస్తున్నానని తెలిపింది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్నానని రకుల్ చెప్పింది.
Go Back to Shorts
Rakul Preet Singh
Nithin
Arjun Kapoor
Amitabh Bachchan

More Telugu News