పబ్జీ గేమ్ లవర్స్ కు గుడ్ న్యూస్

Good news for PUBG lovers
  • మళ్లీ ఇండియాలోకి వస్తున్న పబ్జీ
  • బెంగళూరు కేంద్రంగా రిజిస్టర్ చేయించుకున్న పబ్జీ
  • ఇద్దరు డైరెక్టర్ల నియామకం
సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడున్న నేపథ్యంలో... ఆ దేశానికి చెందిన పలు యాప్ లను ఇండియా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ దేశానికి చెందిన పబ్జీ గేమ్ ను కూడా నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆ గేమ్ లవర్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అయితే మళ్లీ ఇండియాలో అడుగుపెట్టబోతున్నామని ఇటీవలే పబ్జీ ప్రకటించింది.

దీనికి తగ్గట్టుగానే గేమ్ ను ఇండియాలో మరోసారి లాంచ్ చేసేందుకు అవసరమైన కీలక ప్రక్రియను ఆ సంస్థ పూర్తి చేసింది. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ వద్ద రిజిస్టర్ చేయించుకుంది. అంతేకాదు సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది.

బెంగళూరు కేంద్రంగా పబ్జీ ఇండియా ఈనెల 21న రిజిస్టర్ చేయించుకుంది. కృష్ణన్ అయ్యర్, హ్యునిల్ సోహ్న్ లను డైరెక్టర్లుగా నియమించింది. TapTap యాప్ లో పబ్జీ మొబైల్ ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.
Go Back to Shorts
PUBG
India

More Telugu News