తన సొంతవాళ్లున్న చోటే ఓడిపోయిన వ్యక్తి తిరుపతిలో ఏం చేస్తాడు?: పవన్ కల్యాణ్ పై రోజా వ్యాఖ్యలు
- తిరుపతిలో తమదే విజయమంటూ రోజా ధీమా
- మోదీ భజనసేన పార్టీ అంటూ ప్రస్తావన
- మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని సందేహం
"అనేక సమస్యలకు చంద్రబాబు కారణం అయినా, ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదు. ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లో చూస్తే బీజేపీ కోసం జనసేన తప్పుకుంది. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి వైదొలిగారు. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడు? తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా? గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని రోజా ప్రశ్నించారు.