Sonu Sood: స్టార్ హీరోలను వెనక్కు నెట్టేసిన సోనూ సూద్... అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ లో నాలుగో స్థానం!

Sonu Sood is Now Top 4 in Twitter
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో ఎంతో శ్రమించి, రియల్ హీరో అనిపించుకున్న రీల్ విలన్ సోనూ సూద్, తన ఔదార్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు.

ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న వారిలో రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. నాలుగో స్థానంలో సోనూ సూద్ నిలిచారని సోషల్ మీడియా అనలిటిక్స్ వెల్లడించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఖాన్ ల త్రయంతో పాటు, అందరు సూపర్ స్టార్లను, ప్రధాన రాజకీయ నాయకులను సోనూ సూద్ దాటి రావడం గమనార్హం. ఇటీవలే సోనూను పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఐకాన్ గా నియమించుకున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sonu Sood
Twitter
Fallowers
$th Place

More Telugu News