Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

   new 921 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 921 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,097 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,52,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,437కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,047 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,720 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News